పాకిస్తాన్ తో మ్యాచ్: తలపడి గెలుద్దాం

పాకిస్తాన్ తో మ్యాచ్: తలపడి గెలుద్దాం

పుల్వమా ఘటనతో.. భారత్, పాకిస్తాన్ లు ఆడే క్రికెట్ మ్యాచ్ లపై ఉత్కంఠ నెలకొంది. దేశ ప్రజలతో పాటు కొందరు సీనియర్ క్రికెటర్లు..పాక్ తో జరిగే మ్యాచ్ లను ఆడకూడదని అంటున్నారు. ఐసీసీ పరిదిలో జరిగే ప్రపంచ కప్ లో మాత్రం భారత్, పాక్ లు కలిసి ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు భారత మాజీ క్రికెటర్ సునిల్ గవస్కర్.

పాకిస్తాన్ తో భారత్ తలపడితే గెలిచే అవకాశాలు మనకే ఎక్కువ ఉన్నాయన్నారు మాజీ క్రికెటర్ సునిల్ గవస్కర్. ద్వైపాక్షిక సిరీస్ లు ఆడే అవకాశాలు లేనప్పటికీ.. ప్రపంచకప్ లో పాక్ తో ఆడకపోవడం సాధ్యం కాదేమోనని అభిప్రాయపడ్డారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక జట్టు తో ఆడకూడదన్న నిర్ణయాన్ని ఏజట్టూ తీసుకోకూడదని చెప్పారు. ఒకవేళ పాక్ తో మ్యాచ్ ఆడకపోతే భారత్ కు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గవస్కర్ చెప్పారు.  అనవసరంగా మనమే పాకిస్తాన్ కు రెండు పాయింట్లు ఇచ్చినట్టు అవుతుందని అన్నారు. పాక్ పై గెలిచి ఆ టీమ్ ను సెమీస్ కు రాకుండా చేస్తే ఇంకా బాగుంటుందని ఆ సత్తా మన జట్టుకు ఉందని చెప్పారు. అయితే చివరి నిర్ణయాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వానికే వదిలివేస్తున్నామని… ఆడటం ఆడకపోవటం కేంద్రం చేతుల్లో ఉందని తెలిపారు.