
న్యూఢిల్లీ: నాలుగో స్ఠానంలో సరైన బ్యాట్స్‌మన్ లేకపోవడం వల్లే 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఇండియా ఇంటిదారి పట్టిందని సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ఆ ప్లేస్ లో సరైన బ్యాట్స్‌మన్ ఉండుంటే కథ వేరేలా ఉండేదన్నాడు. ఇంగ్లండ్ వేదికగా గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని ఇండియా సెమీఫైనల్ దాటలేకపోయింది. ఆ ఓటమి వెనుక కారణాలపై సునీల్ గావస్కర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. వరల్డ్‌కప్ లో టాప్-3 బ్యాట్స్‌మెన్ లీగ్ దశలో అదరగొట్టారు. దాంతో మిడిలార్డర్ కు పెద్దగా చాన్స్ రాలేదు. దాంతో వారు సరిగా సెటిల్ అవ్వలేదు. దురదృష్టవశాత్తు నాకౌట్ మ్యాచ్‌లో ఇండియా టాపార్డర్ ఫెయిలయ్యింది. అప్పుడు బాధ్యత తీసుకోవాల్సిన 4,5,6 స్థానాల్లోని బ్యాట్స్‌మెన్ ఒత్తిడిని అధిగమించలేకపోయారు. నిజానికి మన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సత్తా ఉన్నవారే. టాపార్డర్లో కూడా ఆడగలరు. కానీ నాలుగో స్థానం విషయంలో పొరపాటు జరిగింది. ఆ ప్లేస్ కు సరైన ప్లేయర్ ఉండుంటే వరల్డ్‌కప్‌లో కథ వేరేలా ఉండేది’ అని సునీల్ గావస్కర్ చెప్పుకొచ్చాడు.
For More News..