కరీంనగర్ మేయర్ గా సునీల్ రావు ప్రమాణం

కరీంనగర్ మేయర్ గా సునీల్ రావు ప్రమాణం

కరీంనగర్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తైంది. TRS పార్టీకి చెందిన 33వ డివిజన్ కార్పొరేటర్ సునీల్ రావు మేయర్ గా, 37వ డివిజన్ కార్పొరేటర్ చల్లా స్వరూపారాణి డిప్యూటీ మేయర్ గా ఎంపికయ్యారు. ఉదయం వీరిద్దరినీ పార్టీ ఖరారు చేయడంతో.. సభ్యుల ప్రమాణం తర్వాత.. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నుకున్నారు.  ముందు తెలుగు అక్షరాల క్రమంలో.. కార్పొరేటర్లతో ప్రమాణం చేయించారు జాయింట్ కలెక్టర్ ప్రసాద్ లాల్. సభ్యుల ప్రమాణం తర్వాత… మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేశారు. మేయర్ ఎన్నికకు ఎక్స్ అఫిషియో మెంబర్లుగా మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సమావేశానికి హాజరయ్యారు.