మెట్రో విస్తరణపై మాట మార్చిన కేంద్రం..తనకేమీ తెలియదన్న కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

మెట్రో విస్తరణపై మాట మార్చిన కేంద్రం..తనకేమీ తెలియదన్న కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
  • తనకేమీ తెలియదన్న కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
  • పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్​కే తెలుసని వ్యాఖ్య
  • ఐఆర్ఎఫ్సీ రుణం విషయంలోనూ తప్పించుకునే ధోరణి

 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు దోహదపడే కీలకమైన హైదరాబాద్ మెట్రో విస్తరణ అంశంపై కేంద్ర ప్రభుత్వం మాట మార్చింది. ఐదు నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి వరుస భేటీలు, విజ్ఞప్తుల తర్వాత రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారు. మెట్రో ఫేజ్‌‌‌‌–I వాల్యూయేష‌‌‌‌న్‌‌‌‌.. ఫేజ్–II విస్తర‌‌‌‌ణ‌‌‌‌కు క‌‌‌‌న్సల్టెంట్‌‌‌‌గాఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ (ఎస్ బీఐసీఏపీఎస్) నియామకం పేరుతో తాత్కాలిక బ్రేక్ లు వేశారు. క‌‌‌‌న్సల్టెంట్ రిపోర్ట్ ఆధారంగా భ‌‌‌‌విష్యత్ కార్యాచ‌‌‌‌ర‌‌‌‌ణా..? అంటూ మెలిక పెట్టారు. ఈ అంశంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్  సోమవారం చేసిన వ్యాఖ్యలు ప్రాజెక్ట్ భవిష్యత్​నే ప్రశ్నార్థకంగా మార్చాయి. 


హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెట్రో రైలు సెంకడ్ ఫేజ్ విస్తరణకు ఆర్థిక సహకారం, ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ (ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైల్వే ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) రుణ వ్యవహారంపై తనకు ఏమీ తెలియదంటూ శాశ్వాత బ్రేక్ లకు సంకేతాలు ఇచ్చారు. ఇది తన శాఖ పరిధిలోని అంశం కాదంటూ సున్నితంగా కొట్టిపారేశారు. ఈ అనుమతుల అంశం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోనిదని, ఆ శాఖ మంత్రి మనోహర్ ఖట్టర్ నే అన్ని తెలుసునంటూ వ్యంగంగా సమాధానం ఇచ్చారు. ఇక తన శాఖ పరిధిలోని ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ రుణం విషయంలోనూ తనకేమి తెలియదని తప్పించుకునే సమాధానం ఇచ్చారు. 

నాడు కీలకం.. ఇప్పుడు తెలియదట.. 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణకు అనుమతులు, నిధులు మంజూరు చేయాలని ఈ ఏడాది 22న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి వెళ్లి మరీ రైల్వే భవన్ లో అశ్వినీ వైష్ణవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలిసి వినతిపత్రాలు అందజేశారు.మెట్రో నిర్వహణతో పాటు తిరిగి ఈ నిధుల్ని చెల్లించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను వివరించారు. తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో తీర్చి దిద్దడంతో పాటు మౌలిక వసతుల కల్పన లో తమ ప్రభుత్వ ఆలోచనలను స్పష్టం చేశారు.  నిధుల సమీకరణ తమ పరిధిలోని మెట్రో విస్తరణకు కావాల్సిన అనుమతులు, ఇతర విషయాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ తో చర్చించాలని నాడు అశ్వినీ వైష్ణవ్ కీలకంగా వ్యవహరించారు. ఇందుకు కేంద్ర మంత్రి అపాయిట్మెంట్ తీసుకోవడంలోనూ పాత్ర పోశించారు. మరుసటి రోజు(జూన్ 23) న  కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నివాసంలో జరిగిన భేటీలోనూ ఖట్టర్, కిషన్ రెడ్డి, సీఎంల భేటీలోనూ అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు   

కన్సల్టెంట్ పేరిట తాత్కాలిక బ్రేక్ లు 

వరుసగా రెండు రోజుల సమవేశాల తర్వాత... హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్ మెట్రో ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–I వాల్యూయేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–I స్వాధీనానికి అవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మైన రుణ సేక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–II విస్తర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిర్మాణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యయం, అందుకు అవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మైన  రుణ సేక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ అంశాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అధ్యయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నం చేసేందుకు క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్సల్టెంట్ ను నియ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మించాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని నిర్ణయిస్తూ కేంద్రం తాత్కాలిక బ్రేక్ లు వేసింది. క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్సల్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎస్బీఐసీఏపీఎస్ ని  ఎంపిక చేసి... మెట్రో ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–I వాల్యూయేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌... ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-II విస్తర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...ఇత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర అంశాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రంగా అధ్యయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నం బాధ్యతలు అప్పగించింది.

ఈ క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్సల్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ ఇచ్చే రిపోర్ట్  ఆధారంగా భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌విష్యత్ కార్యాచ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ ఉంటుందని పేర్కొంది. క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్సల్టెంట్ అధ్యయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నం స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యంలో స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్వయానికి ప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫున రాష్ట్ర పుర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టణాభివృద్ధి (ఎంఏ &యూడీ) శాఖ స్పెషల్ సెక్రటరీ ఉండాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మావేశంలో నిర్ణయించారు. ఈ అధికారులు ఇద్దరు స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియ వేగంగా సాగేందుకు కృషిచేయాలని ఒప్పందానికి వచ్చారు. అయితే ఐదు నెలలైనా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు.  

ఉద్దేశపూర్వకంగానే 

కేంద్ర ప్రభుత్వ శాఖల తీరు, కేంద్ర మంత్రుల వ్యాఖ్యలు మెట్రో విస్తరణ విషయంలో అనుమానాలను రేకిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ పర్యటనలోనూ సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆందోళనలే వ్యక్తం చేశారు.  మెట్రో విస్తరణపై కేంద్రం చెప్పినట్లు ఎల్ అండ్ టీ నుంచి టేకోవర్ చేసుకున్నామన్నారు.  ఈ ఫైల్ ను ఏ కారణం చేత ఆపారో కేంద్ర ప్రభుత్వం చెప్పడం లేదన్నారు. అలాగే ఐఆర్ఎఫ్సీ నుంచి నిధులు రాకుండా ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రాజెక్ట్ ను ఆపుతోందని ఆరోపించారు.