మల్కాజ్ గిరిలో సునీతా మహేందర్​రెడ్డి నామినేషన్

మల్కాజ్ గిరిలో సునీతా మహేందర్​రెడ్డి నామినేషన్

శామీర్ పేట, వెలుగు: మల్కాజ్​గిరి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీతా మహేందర్ రెడ్డి సోమవారం నామినేషన్ వేశారు. పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి మేడ్చల్​కలెక్టరేట్​లో కలెక్టర్ గౌతమ్ కు నామినేషన్​ పత్రాలు అందజేశారు. ఆమె వెంట మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్​చార్జ్ వజ్రాశ్​ యాదవ్ ఉన్నారు.