ఆటే కాదు అనుబంధం కూడా : సన్ రైజర్స్ ఉగాది శుభాకాంక్షలు

ఆటే కాదు అనుబంధం కూడా : సన్ రైజర్స్ ఉగాది శుభాకాంక్షలు

ఐపీఎల్ ఫీవర్ తో ఇండియా ఊగిపోతోంది. హైదరాబాద్ లో అయితే చెప్పనక్కర్లేదు. హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ మ్యాచ్ లు ఉన్నాయంటే.. ఆరోజు నగరం టీవీలకు అతుక్కుపోతోంది. ఉప్పల్ స్టేడియం చుట్టుపక్కల రోడ్లు.. బ్లాక్ అయిపోవాల్సిందే. ట్రాఫిక్ డైవర్షన్స్ తీసుకోవాల్సిందే. ఆటగాళ్ల కొట్టుడుకు… అభిమానుల కేరింతలతో.. స్టేడియంలో చుట్టుపక్కల ప్రాంతాలు దద్దరిల్లిపోవాల్సిందే.

సన్ రైజర్స్ టీమ్ పై సిటీ చూపించే అఫెక్షన్ అది. ఆరెంజ్ ఆర్మీని హైదరాబాద్ ఏనాడో ఓన్ చేసుకుంది. ఇంతటి ఆదరణ చూపిస్తున్న నగరానికి.. అభిమానులకు ఉగాది పండుగ శుభాకాంక్షలను ప్రత్యేకంగా చెప్పారు సన్ రైజర్స్ టీమ్ ప్లేయర్స్. తెలుగు రాదు.. మన దేశం కాదు… ఐనా… ఉగాది శుభాకాంక్షలు చెప్పి.. ఓ వీడియోను రూపొందించి అభిమానులకు గిఫ్ట్ గా ఇచ్చారు. ఆటతోనే కాదు.. పండుగలోనూ మీతో పాలుపంచుకుంటున్నామని చెప్పకనే చెప్పింది SRH టీమ్.

యూసుఫ్ పఠాన్, బెయిర్ స్టో, మహ్మద్ నబీ.. ఇలా కొందరు ప్లేయర్లు హ్యాపీ ఉగాది అంటూ విష్ చేశారు. ఆ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ ఓసారి చూసేయండి.