ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న కీలక పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ ప్లేఆఫ్స్ రేసులో అత్యంత కీలకం.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేస్తాం.. ఈ పిచ్‌పై ఇప్పటి వరకు ఆడలేదు, కాబట్టి మొదట బంతితో పరిస్థితులను అంచనా వేసి, ఆపై లక్ష్యాన్ని ఛేదించాలనుకుంటున్నాం.. టోర్నీ ముగింపు దశలో మాకు మూడు మ్యాచ్‌లు ఉన్నాయి, కోల్పోవడానికి ఏమీ లేదు.. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని కమిన్స్ వెల్లడించారు.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. మేము కూడా మొదట బౌలింగ్ చేయాలనుకున్నాం.. గత కొన్ని మ్యాచ్‌లతో పోలిస్తే ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది.. టోర్నమెంట్ చివరి దశలో అత్యుత్తమ ప్రదర్శన చేయడం ముఖ్యం.. మేము కూడా గత మ్యాచ్ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని గిల్ పేర్కొన్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరన్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్ (కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, నిశాంత్ సింధు, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్
🚨 Toss 🚨@SunRisers have won the toss and elected to bowl first against @gujarat_titans in Match 5️⃣6️⃣
— IndianPremierLeague (@IPL) May 12, 2026
Updates ▶️ https://t.co/o2tKKCeEaH#TATAIPL | #KhelBindaas | #GTvSRH pic.twitter.com/ZhAfnLdsMH
