RCBకి సన్ రైజర్స్ స్ట్రోక్..ఆల్రౌండ్ ప్రతిభతో SRH విక్టరీ..ఫిన్ సాల్ట్, కోహ్లీ పోరాట వృధా

 RCBకి సన్ రైజర్స్ స్ట్రోక్..ఆల్రౌండ్ ప్రతిభతో SRH విక్టరీ..ఫిన్ సాల్ట్, కోహ్లీ పోరాట వృధా

లక్నోవేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ కొట్టేసింది. SRH పెట్టిన 232 పరుగుల లక్ష్యాన్ని RCB ఛేదించడంలో తడబడింది. ఫిన్ సాల్ట్ 32 బంతుల్లో 62 పరుగులు , విరాట్ కోహ్లీ 25 బంతుల్లో 43 ధాటిగా ఆడినప్పటికీ ఆతర్వాత వికెట్లు టపాటపా పడటంతో RCB ఓటమిని చవిచూసింది. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో మిగతా బ్యాటర్లు జితేష్ శర్మ 15 బంతుల్లో 24 పరుగులు చేశారు. అంతకుముందు టాస్ గెలిచిన RCB...సన్ రైజర్స్ హైదరాబాద్ కు బ్యాటింగ్ అప్పగించగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముందు 232 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 

సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కేవలం 48 బంతుల్లో 94 నాటౌట్ అజేయంగా నిలిచాడు. ధనాధన్ షాట్లతో ఆకట్టుకున్న ఇషాన్.. కొద్దిలో సెంచరీ మిస్ అయ్యింది. శుక్రవారం (మే23) లక్నో స్టేడియంలో ఆర్సిబీతో జరిగిన మ్యాచ్ లో ఇషాన్ చెలరేగడంతో SRH  20 ఓవర్లలో 6వికెట్లకు 231 పరుగులు చేసింది. 

SRH బ్యాటర్లలో ఇషాన్ కిషన్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 48 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో కిషన్ 94 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అభిషేక్ శర్మ(34), క్లాసెన్‌(24), హెడ్‌(17), అనికేత్ వర్మ(26) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో రొమారియో షెపర్డ్ రెండు వికెట్లు పడగొట్టగా.. సుయాష్‌, ఎంగిడీ,భువనేశ్వర్‌, పాం‍డ్యా తలా వికెట్ సాధించారు.