తెలంగాణలో నిప్పుల కుంపటి.. వడదెబ్బతో 22 మంది మృతి.. వివరాలు ఇవే..!

తెలంగాణలో నిప్పుల కుంపటి.. వడదెబ్బతో 22 మంది మృతి.. వివరాలు ఇవే..!

వెలుగు నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ : రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం వడదెబ్బతో 20 మందికిపైగా  చనిపోయారు. మంచిర్యాల జిల్లా జన్నారం గ్రామానికి చెందిన యాట ఇందయ్య(60), కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఎంప్లాయిస్ కాలనీకి చెందిన దాసరపు కాంతమ్మ (59), రామడుగు మండలం గోపాల్‌‌‌‌‌‌‌‌రావుపేటకు చెందిన షేర్ల నరేష్ (30), సిద్దిపేట జిల్లా కోడూరుకు చెందిన గొట్టిపర్తి రమణమ్మ (75) చనిపోయారు. 

అలాగే భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందిన జలగం ప్రభావతి (60), పాత పాల్వంచ గడియకట్టకు చెందిన జంగపల్లి సువార్తమ్మ (65), గట్టాయిగూడెంకు చెందిన చందన బోయిన మల్లయ్య (85), చర్ల మండలం కలివేరుకు చెందిన మజ్జూరి పెంటమ్మ, జగన్నాథపురం గ్రామానికి చెందిన ముత్తిని నరసింహారావు (70), అశ్వారావుపేటలోని ఇందిరాగాంధీ కాలనీకి చెందిన భోగి మంగ (65), దమ్మపేట మండలం చలమప్పగూడెంకు చెందిన బండారి నాగలక్ష్మి (40), ఖమ్మం జిల్లా పెనుబల్లి బీసీ కాలనీకి చెందిన ఎండి.ఉస్మాన్‌‌‌‌‌‌‌‌ (42), ఖమ్మం రూరల్ మండలం దారేడు గ్రామానికి చెందిన షేక్ ఇమామ్ (45), కూసుమంచి మండలం బోడియాతండాకు చెందిన భూక్యా అచ్చమ్మ (70) వడదెబ్బతో చనిపోయారు.

 ములుగు జిల్లా మంగపేటకు తాడిసత్యవతి (80), కమలాపురం గ్రామానికి చెందిన అన్నపురెడ్డి లక్ష్మీబాయి (80), నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా నవీపేటలో రాయుడు రమేశ్‌‌‌‌‌‌‌‌ (42), నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌ మండలం గన్యాగులకు చెందిన బక్కశేఖర్ (45), భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్దకోమటిపల్లికి చెందిన ముప్పు ఓదేమ్మ(75), నగరంపల్లికి చెందిన కొడారి సాంబయ్య (52) వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. 

అలాగే వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన పెద్దోజు అనసూర్య ( 75), కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లికి చెందిన గుర్రం రాజయ్య (62) వడదెబ్బతో అస్వస్థతకు గురై చనిపోయారు.