సూపక్ క్లాసిక్ చెస్ టోర్నీ: ప్రజ్ఞానంద మూడో గేమ్ డ్రా

 సూపక్ క్లాసిక్ చెస్ టోర్నీ: ప్రజ్ఞానంద మూడో గేమ్ డ్రా

బుకారెస్ట్‌‌‌‌‌‌‌‌: గ్రాండ్‌‌‌‌‌‌‌‌ చెస్‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌లో భాగంగా జరుగుతున్న సూపర్‌‌‌‌‌‌‌‌ క్లాసిక్‌‌‌‌‌‌‌‌ చెస్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో ఇండియా గ్రాండ్ మాస్టర్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌. ప్రజ్ఞానంద జోరు కొనసాగుతోంది. విన్సెంట్‌‌‌‌‌‌‌‌ కీమర్‌‌‌‌‌‌‌‌ (జర్మనీ)తో ఆదివారం జరిగిన మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌ను ప్రజ్ఞానంద 64 ఎత్తుల వద్ద డ్రాగా ముగించాడు. తెల్ల పావులతో ఆడిన ఇండియన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ క్యాపాబ్లాంకా వేరియేషన్‌‌‌‌‌‌‌‌ను ఎంచుకున్నాడు. 

కీమర్‌‌‌‌‌‌‌‌ నిమ్జో ఇండియన్‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌తో ముందుకొచ్చాడు. అయితే కీమర్‌‌‌‌‌‌‌‌ ప్రారంభంలోనే ఓ పాన్‌‌‌‌‌‌‌‌ను త్యాగం చేయగా, 64వ ఎత్తుకు చేరేసరికి ఇద్దరూ రూక్‌‌‌‌‌‌‌‌, మైనర్‌‌‌‌‌‌‌‌ పీస్‌‌‌‌‌‌‌‌ ఎండ్‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌లో నిలిచారు. ప్రజ్ఞా వద్ద ఒక పాన్‌‌‌‌‌‌‌‌ అదనంగా ఉన్నా.. కీమర్‌‌‌‌‌‌‌‌ అద్భుతంగా డిఫెండ్‌‌‌‌‌‌‌‌ చేయడంతో గేమ్‌‌‌‌‌‌‌‌ డ్రా అయ్యింది. ఈ రౌండ్‌‌‌‌‌‌‌‌ తర్వాత ప్రజ్ఞానంద రెండు పాయింట్లతో ఉమ్మడిగా టాప్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతున్నాడు.