హైదరాబాద్, వెలుగు: ఎపియోన్ పెయిన్మేనేజ్మెంట్సెంటర్లో గ్రేడ్–4 మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్‌కు సూపర్ పీఆర్పీ చికిత్సను అందుబాటులోకి తెచ్చారు. ప్లాస్మా థెరపీ వ్యవస్థాపకుడు డాక్టర్సుధీర్ దారా మాట్లాడుతూ.. సాధారణ పీఆర్పీతో పోలిస్తే సూపర్ పీఆర్పీలో 25 రేట్లు గ్రోత్ ఫ్యాక్టర్లు ఉంటాయన్నారు. వేగంగా నయం చేయడానికి యాక్టివేటర్లు ఉంటాయని చెప్పారు. ఈ విధమైన చికిత్స గ్రేడ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్‌లో సక్సెస్సాధిస్తోందని తెలిపారు. ఎక్స్-రే లేదా అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా గ్రేడ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్‌ను గుర్తించడం సాధ్యం కాదని, పూర్తి అంచనాకు ట్రిపుల్ స్కాన్ అవసరం అన్నారు.
