సల్మాన్, ఆమిర్, షారుక్ సరసన మహేశ్

సల్మాన్, ఆమిర్, షారుక్ సరసన మహేశ్

ఫరెవర్ డిజైరబుల్.

ప్రఖ్యాత టైమ్స్ సంస్థ ఇచ్చే అరుదైన గుర్తింపు ఇది.

మోస్ట్ డిజైరబుల్ లిస్ట్ లో పదే పదే చేరుతున్న మూవీ, ఫ్యాషన్ సెలబ్రిటీలకు ఈ గుర్తింపు ఇస్తుంటుంది టైమ్స్.

ఇప్పటికి ఈ లిస్టులో బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్ మాత్రమే ఉన్నారు. ఈ లిస్టులోకి ఇప్పుడు టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేశ్ బాబు చేరాడు.

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో జనాదరణ పొందుతున్న యాక్టర్స్ కు ఈ గుర్తింపు ఇస్తుంది సంస్థ.

టైమ్స్ రెగ్యులర్ గా విడుదలచేసే మోస్ట్ డిజైరబుల్ 50 లిస్టులో… ఫరెవర్ డిజైరబుల్ క్లబ్ లోని స్టార్స్ కు ప్లేస్ ఉండదని సంస్థ తెలిపింది.