గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై హైకోర్టుకు వెళ్లండి : సుప్రీంకోర్టు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై హైకోర్టుకు వెళ్లండి : సుప్రీంకోర్టు
  • సుప్రీం కోర్టు సూచన

న్యూఢిల్లీ, వెలుగు:  గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకాలపై దాఖలైన పిటిషన్ల విచారణలో సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసిన పేర్లను గవర్నర్ ఆమోదించకపోతే హైకోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. 

ఎమ్మెల్సీ నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని 2024, ఆగస్టు 4న దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ సిఫారసులతో ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, అమీర్ అలీఖాన్ ల నియామకాన్ని గత ఏడాది ఆగస్టు 13న సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇదే వ్యవహారంలో మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్ ఎం నూలీ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. 

అలీఖాన్ ఇప్పటికే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసినందున, ఆయనను కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించగా, ధర్మాసనంతోసి పుచ్చింది. కోదండరాం తరఫున గవర్నర్ వద్ద పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న సిఫారసులపై స్పందించాలని కోరగా, “అలాంటి పరిస్థితుల్లో హైకోర్టుకే వెళ్లాలి” అని జస్టిస్ విక్రమ్ నాథ్ సూచించారు. ఇదే సమయంలో అమీర్ అలీఖాన్ తరపు న్యాయవాదికి కూడా హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను ధర్మాసనం ఇచ్చింది. ఇప్పటికీ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను మంత్రివర్గం గవర్నర్‌‌‌‌‌‌‌‌కు సిఫారసు చేసినప్పటికీ, అవి ఇంకా ఆమోదం కోసం పెండింగ్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నాయి.