సోషల్ మీడియా కంటెంట్ పై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది..వ్యక్తిగతంగా ఎవరు పడితే వారు ఛానెళ్లను ప్రారంభించి బాధ్యతరహితంగా ఉంటున్నారు.. కంటెంట్ తొలగించే లోపే దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.. సోషల్ మీడియా కంటెంట్ ను నియంత్రించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా తల్లిదండ్రుల శృంగారంపై ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నలకు వివాదాస్పదం అయిన కేసు తాజా విచారణలో జస్టిస్ సూర్యకాంత్ , జస్టిస్ జోయ్ మల్య బాగ్చీ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆన్ లైన్ లో అభ్యంతర కరమైన కంటెంట్ నియంత్రణకు కొన్ని సెకనుల వయోజన కంటెంట్ హెచ్చరికలు సరిపోవని.. కంటెంట్ క్రియేటర్ల వయస్సు, ఆధార్ వివరాలు తీసుకోవడం వంటి చర్యలు చేపట్టాలని సూచించింది.
యూట్యూబర్లు, కంటెంట్ క్రియేటర్లు తమ సొంత ఛానెళ్లు ప్రారంభించి అభ్యంతరకరమైన, ప్రజాప్రయోజనాలను దెబ్బతీసే కంంటెంట్ షేర్ చేసి బాధ్యత లేకుండా ఉండటం చాలా వింతగా ఉందని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో కంటెంట్ తొలగింపుకు కనీసం 24 గంటలు పడుతుంది.. సోషల్ మీడియా పాదరసం లాంటి సరిహద్దులు దాటి వెళ్తుంది. సెకన్లలో వ్యాప్తి చెందుతుంది. ఈలోపు జరగాల్సిన హాని జరిగిపోతుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
ఆన్ లైన్ లో అశ్లీల, అభ్యంతరకర, చట్ట విరుద్దమైన కంటెంట్ ను నియంత్రించేందుకు స్వతంత్ర, స్వయం ప్రతిపత్తి గల సంస్థ అవసరమని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను కోరింది. సోషల్ మీడియా కంటెంట్ నియంత్రణకు నిబంధనలు తీసుకురావడానికి నాలుగు వారాల గడువు వచ్చింది సుప్రీంకోర్టు.
