ముంబై హోటల్ యజమాని హత్య కేసులో.. గ్యాంగ్స్టర్ చోటా రాజన్బెయిల్క్యాన్సిల్

ముంబై హోటల్ యజమాని హత్య కేసులో.. గ్యాంగ్స్టర్ చోటా రాజన్బెయిల్క్యాన్సిల్

న్యూఢిల్లీ: ముంబైలో 2001లో జరిగిన హోటల్​యజమాని జయ శెట్టి హత్య కేసులో గ్యాంగ్‌‌‌‌స్టర్ చోటా రాజన్‌‌‌‌కు బాంబే హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌‌‌‌ను సుప్రీంకోర్టు బుధవారం రద్దు చేసింది. 2001 మే 4న చోటా రాజన్ మనుషులు జయ శెట్టిని కాల్చి చంపారు. జయ శెట్టికి ఫోన్​చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్​ చేశాడని.. ఆయన డబ్బులు ఇవ్వకపోవడంతో హత్య చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. 2024 మేలో ఈ కేసులో ప్రత్యేక కోర్టు రాజన్‌‌‌‌ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. కాగా, ఈ కేసులో గత సంవత్సరం అక్టోబర్ 23న రాజన్‌‌‌‌ జీవిత ఖైదును నిలిపివేసి, అతనికి బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.