నీట్ ప్రవేశాల్లో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్లకు.. సీట్లను రిజర్వ్ చేయాలని ఉత్తర్వులివ్వలేం: సుప్రీం కోర్టు

నీట్ ప్రవేశాల్లో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్లకు.. సీట్లను రిజర్వ్ చేయాలని ఉత్తర్వులివ్వలేం: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, వెలుగు: నీట్ -పీజీ ప్రవేశాల్లో ట్రాన్స్‌‌‌‌జెండర్ అభ్యర్థుల కోసం సీట్లను రిజర్వ్ చేసేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని సుప్రీం కోర్టు సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. ఆల్ ఇండియా కోటాలో రెండు సీట్లు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కో సీటు కేటాయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌‌‌‌ను గురువారం (సెప్టెంబర్ 17) సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌‌‌‌లతో కూడిన బెంచ్  విచారించింది.

పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ ఇందిరా జైసింగ్ వాదిస్తూ.. 2014లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు ట్రాన్స్‌‌‌‌జెండర్లకు రిజర్వేషన్ అందించాలని తీర్పు ఇచ్చినప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అమలు చేయడం లేదని తెలిపారు.