వామన్ రావు దంపతుల హత్య కేసుపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు

వామన్ రావు దంపతుల హత్య కేసుపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే ఇందులో  ఆసక్తికర పరిణామాలు జరిగాయి. న్యాయవాది దంపుతుల హత్యపై యాంటి కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ సంస్థ.. సుప్రీంను ఆశ్రయించింది. వామన్ రావు దంపతుల హత్యపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరింది.ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే ధర్మాసనం.. ఈ అంశం తెలంగాణ జ్యుడిషియరీ పరిధిలో ఉందని వ్యాఖ్యానించారు చీఫ్ జస్టిస్. అయితే, తెలంగాణ హైకోర్టులో దీనికి సంబంధించి రెండు పిటిషన్లు ఉన్నాయని తెలిపారు పిటిషనర్. దీనిపై సుప్రీం కోర్టు స్పందిస్తూ.. వామన్ రావు దంపతుల హత్య అంశంలో అభ్యంతరాలను హైకోర్టు దృష్టికే తీసుకెళ్లాలని సూచించింది. దేశవ్యాప్తంగా న్యాయవాదుల రక్షణకు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కూడా పిటిషనర్ కోరారు. మరోవైపు.. సుప్రీంకోర్టు సూచనతో పిటిషన్ ను ఉపసంహరించుకుంది యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్.