- అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: వన్యప్రాణుల దాడిలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను తప్పనిసరిగా చెల్లించాలని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వన్యప్రాణుల దాడిని ప్రకృతి వైపరీత్యంగా పరిగణించాలని సూచించింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఇదే స్థాయిలో ఎక్స్గ్రేషియా చెల్లిస్తున్నాయి. మిగతా రాష్ట్రాలు కూడా దీన్ని అమలు చేయాలని, ఇంతే మొత్తం పరిహారంగా చెల్లించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీమ్తో కూడిన బెంచ్సోమవారం ఆదేశించింది.
ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్స్ పథకం కింద పరిహారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. హ్యూమన్, వైల్డ్‌లైఫ్ కాన్ఫ్లిక్ట్ నివారణకు ఆరు నెలల్లో గైడ్‌లైన్స్ రూపొందించాలని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ)కు సుప్రీంకోర్టు ఆర్డర్ జారీ చేసింది. ఈ గైడ్ లైన్స్ అందిన 6 నెలల్లోగా తప్పకుండా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
