
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం(ఆగస్టు7) కొట్టివేసింది. ఈ కేసులో వర్మపై కేసు నమోదు చేసి ఆయనను దోషిగా తేల్చిన అంతర్గత విచారణ నివేదికతోపాటు జస్టిస్ వర్మ తొలగింపునకు రాష్ట్రపతి, ప్రధానమంత్రికి అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా సిఫార్సును చేశాడని ఆరోపణ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. జూలై 30న తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎ.జి. మసీహ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పును ప్రకటించింది.
అంతర్గత విచారణ సందర్భంగా జస్టిస్ వర్మ ప్రవర్తన,తరువాత విచారణ అంతర్గత ప్యానెల్ సామర్థ్యాన్ని ప్రశ్నిండంపై తీవ్రంగా తీసుకున్న ధర్మాసనం..రిట్ పిటిషన్‌ను అస్సలు స్వీకరించలేమని తెలిపింది. మార్చి 14న జరిగిన అగ్నిప్రమాద సంఘటన తర్వాత కరెన్సీ నోట్లు బయటపడిన ఘటనలో జస్టిస్ వర్మ ప్రవర్తన అసహజమని, ఇది అతనిపై కొన్ని అనుమానాలకు ఉన్నాయని ముగ్గురు న్యాయమూర్తుల అంతర్గత విచారణ కమిటీ పేర్కొంది.
విచారణ సందర్బంగా జస్టిస్ వర్మ తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గీ, రాకేష్ ద్వివేది ,సిద్ధార్థ్ లూథ్రా,న్యాయవాదులు జార్జ్ పోతన్ పూతికోట్, మనీషా సింగ్ కూడా హాజరయ్యారు.