మీడియాలో ప్రచారం కోసం సుప్రీంకోర్టు వేదిక కాదు.. కేఏ పాల్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

మీడియాలో ప్రచారం కోసం సుప్రీంకోర్టు వేదిక కాదు.. కేఏ పాల్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ, వెలుగు: ప్రచారానికి సుప్రీంకోర్టు వేదిక కాదని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్‌‌‌‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలని చెప్పింది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను పూర్తి చేయాలనే ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గత నెల 15న కేఏ పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

ఏపీ ప్రభుత్వం, డాక్టర్ వైఎస్సార్‌‌‌‌‌‌‌‌ వర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌‌‌‌తో పాటు కేంద్రం, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ), ఉత్తరప్రదేశ్‌‌‌‌, మధ్యప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, చత్తీస్‌‌‌‌గఢ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌‌‌‌పై సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీల బెంచ్​ విచారణ జరిపింది. ఈ పిటిషన్‌‌‌‌కు విచారణ అర్హత లేదన్న ధర్మాసనం.. కేఏ పాల్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. మీడియాలో ప్రచారం కోసం పిటిషన్లు వేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌‌‌‌ను డిస్మిస్ చేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.