లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సుప్రీంకోర్టు నోటీసులు..

లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
  • షిండే వర్గంలో ఆరుగురు ఎంపీల విలీనం నేపథ్యంలో నిర్ణయం 

న్యూఢిల్లీ: ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) వర్గానికి చెందిన ఆరుగురు లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ సభ్యులను, ఏక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనం చేస్తూ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ స్పీకర్ ఓం బిర్లా తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విచారించిన న్యాయస్థానం బుధవారం లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ స్పీకర్ ఓం బిర్లా, లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ సెక్రటరీ, ఆరుగురు తిరుగుబాటు ఎంపీలకు నోటీసులు జారీ చేసింది.

 రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కాగా, పిటిషనర్ తరపున సీనియర్ అడ్వొకేట్ దేవదత్త కామత్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసు రాజ్యాంగ నైతికత, ఔచిత్యానికి సంబంధించిన కీలకమైన అంశాలతో కూడుకున్నదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్ణయంపై మధ్యంతర స్టే విధించాలని కోరగా సుప్రీంకోర్టు నిరాకరించింది. లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నోటీసులు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది