విచారణకు  హాజరవ్వండి .. వట్టె జానయ్య కేసులో రాష్ట్ర డీజీపీకి సుప్రీంకోర్టు నోటీసులు

విచారణకు  హాజరవ్వండి .. వట్టె జానయ్య కేసులో రాష్ట్ర డీజీపీకి సుప్రీంకోర్టు నోటీసులు

 న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్​ హయాంలో తనపై కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ మాజీ నేత వట్టె జానయ్య దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా రాష్ట్ర డీజీపీకి సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 4వ తేదీన తదుపరి విచారణకు వర్చువల్ గా లేదా వ్యక్తిగతంగా తమ హాజరుకావాలని ఆదేశించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీసులు తనపై ఒకేసారి పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ వట్టె జానయ్య గతేడాది సెప్టెంబర్ 20న సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్లపై అక్టోబర్ 6, 2023న విచారణ జరిపిన జస్టిస్‌‌‌‌ హృషీకేశ్ రాయ్, జస్టిస్‌‌‌‌ ఎస్‌‌‌‌వీఎన్‌‌‌‌ భట్టితో కూడిన ధర్మాసనం.. జానయ్యను అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. మంగళవారం మరోసారి ఈ పిటిషన్లు బెంచ్ ముందు విచారణకు రాగా, పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రాసిక్యూషన్, ప్రభుత్వ న్యాయవాది మధ్య అనుసంధాన లోపం స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. తా

ము లేవనెత్తిన అంశాలకు రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ సమాధానం చెప్పలేకపోతున్నందున తమ ముందు హాజరుకావాలని డీజీపీకి నోటీసులు ఇచ్చింది. 4వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లేదా నేరుగా హాజరుకావాలని ఆదేశించింది. అలాగే చార్జీషీట్ సమాచారంతో సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది.