అయోధ్య కేసు దర్యాప్తుపై 2 వారాల్లో రిపోర్ట్ ఇవ్వండి.. యూపీ ప్రభుత్వానికి సుప్రీం ఆర్డర్

అయోధ్య కేసు దర్యాప్తుపై 2 వారాల్లో రిపోర్ట్ ఇవ్వండి.. యూపీ ప్రభుత్వానికి సుప్రీం ఆర్డర్

న్యూఢిల్లీ: అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన విరాళాల దుర్వినియోగం, నిధుల గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరోపణలపై విచారణను సుప్రీంకోర్టు స్పీడప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)లో ఒక ఫోరెన్సిక్ ఆడిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేర్చాలని సోమవారం ఆదేశించింది. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు పురోగతిపై స్టేటస్ రిపోర్టును రెండు వారాల్లో కోర్టుకు సమర్పించాలని చెప్పింది. 

విరాళాల దుర్వినియోగంపై సీబీఐ విచారణ జరిపించాలని, ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలపై ఆడిట్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జైమాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనల బెంచ్​ విచారణ చేపట్టింది. సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫోరెన్సిక్ ఆడిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేర్చాలన్న సుప్రీంకోర్టు సూచనను అమలుచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్జీ తుషార్ మెహతా తెలిపారు. కాగా, ‘ప్రస్తుతం మా దృష్టి అంతా దర్యాప్తుపైనే ఉంది. సిట్‌‌ నివేదిక వచ్చాక మిగిలిన విషయాలను పరిశీలిస్తాం’ అని  సీజేఐ పేర్కొన్నారు.