ఏం చేస్తారో తెలీదు.. వెంటనే ఆపేయండి.. అది మీ పని... పంజాబ్ లో మంటలపై సుప్రీం ఆగ్రహం

ఏం చేస్తారో తెలీదు.. వెంటనే ఆపేయండి.. అది మీ పని... పంజాబ్ లో మంటలపై సుప్రీం ఆగ్రహం

దేశ రాజధానిలో 'తీవ్రమైన' వాయు కాలుష్యం మధ్య, నవంబర్ 7న సుప్రీంకోర్టు.. ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వాన్ని గట్టిగా మందలించింది. రాష్ట్రంలో తగులబెట్టే పనిని ఆపేయాలని కోరింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. "అన్ని వేళలా రాజకీయ పోరాటం ఉండదు. కాల్చడాన్ని నిలిపివేయాలని మేం కోరుకుంటున్నాం. మీరు దీన్ని ఎలా చేస్తారో మాకు తెలియదు. ఇది మీ పని. కానీ అది ఆపేయాలి. తక్షణమే ఏదో ఒకటి చేయాలి’’ అని పంజాబ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.

దేశ రాజధానిలో వాయుకాలుష్యం పెరగడానికి దోహదపడే అంశాల్లో ఒకటిగా ఉన్న పంట చెత్తను తగులబెట్టిన అనేక సంఘటనలు పునరావృతం కావడంతో సుప్రీంకోర్టు ఈ తరహా వ్యాఖ్యలు చేసింది. దేశ రాజధానికి పంజాబ్ 500 కి.మీ దూరంలో ఉండగా, హర్యానా కేవలం 100 కి.మీ దూరంలో ఉందని ఢిల్లీలో కాలుష్యానికి హర్యానా ప్రభుత్వమే కారణమని ఆప్ ఇటీవల ఆరోపించింది. ""ఈ సంవత్సరం ఢిల్లీ గత ఎనిమిదేళ్లలో అత్యుత్తమ గాలి నాణ్యతను కలిగి ఉంది. ఢిల్లీలో కాలుష్యం 31 శాతం తగ్గిందని డేటా చెబుతోంది. CAQM ప్రకారం, స్టబ్బింగ్ బర్నింగ్‌లో 50-67 శాతం తగ్గుదల ఉంది. పంజాబ్‌లో జరుగుతున్న దగ్ధం ఇక్కడికి 500 కి.మీ., హర్యానాలో 100 కి.మీల దూరంలో ఉంది’’ అని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ తెలిపారు.

పంజాబ్‌లో మంటలు

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 6న పంజాబ్‌లో 2,060 కాల్చిన కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత సీజన్‌లో, పంజాబ్‌లో 19వేల 463కు చేరుకుంది. గడిచిన 9 రోజుల్లో, పంజాబ్‌లో 15వేల కంటే ఎక్కువ పిచ్చిమొక్కలు కాల్చిన కేసులు నమోదయ్యాయి. సోమవారం నాడు సంగ్రూర్‌లో 509, బటిండాలో 210, మాన్సాలో 195, ఫిరోజ్‌పూర్‌లో 146, బర్నాలాలో 189, మోగాలో 110 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.