ఎలక్టోరల్ బాండ్లు: పూర్తి వివరాలివ్వండి .. ఎస్బీఐపై సుప్రీం ఆగ్రహం

ఎలక్టోరల్ బాండ్లు:  పూర్తి వివరాలివ్వండి .. ఎస్బీఐపై సుప్రీం ఆగ్రహం

ఎలక్టోరల్ బాండ్ల కేసులో SBIకి మరోసారి నోటీసులు జారీచేసింది సుప్రీం కోర్టు ధర్మాసనం. ఎన్నికల సంఘానికి అందించిన వివరాలు సరిగా లేవని అసహనం వ్యక్తం చేసింది. ఎలక్ట్రోరల్ బాండ్ల నెంబర్లు లేకపోవడంతో ఎవరికి ఇచ్చారన్న విషయం తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయమూర్తులు. అన్ని వివరాలు చెప్పాలని గతంలో ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసినా..  అందుకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు సీజేఐ చంద్రచూడ్. ఈ నెల 18లోగా అన్ని వివరాలు ఈసీకి ఇవ్వాలని SBIని ఆదేశించారు. 

మరోవైపు గతంలో సీల్డ్ కవర్ లో ఈసీ ఇచ్చిన వివరాలను స్కాన్ చేసి డిజిటలైజ్ చేయాలని రిజిస్ట్రీకి సూచించింది సుప్రీంకోర్టు. సీల్డ్ కవర్ లో ఇచ్చిన వివరాలను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ తన వెబ్ సైట్ లో రేపు సాయంత్రం 5 గంటల వరకు ఉంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈలోగా తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని SBIని ఆదేశించింది.