ప్రొ. సాయిబాబా కేసులో.. మహారాష్ట్ర స‌‌ర్కార్‌‌కు షాక్‌‌

ప్రొ. సాయిబాబా కేసులో.. మహారాష్ట్ర స‌‌ర్కార్‌‌కు షాక్‌‌
  • బాంబే హైకోర్టు తీర్పుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కేసులో మహారాష్ట్ర సర్కార్​కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన‌‌ను సుప్రీం కొట్టివేసింది. మావోయిస్టుల‌‌తో సంబంధాల కేసులో సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తు ఇటీవల బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై మహారాష్ట్ర సర్కారు సుప్రీంను ఆశ్రయించింది.

ఈ పిటిషన్​ను సోమవారం జ‌‌స్టిస్ బిఆర్ గ‌‌వాయి, జస్టిస్ సందీప్ మెహ‌‌తాల‌‌తో కూడిన ధ‌‌ర్మాస‌‌నం విచారించింది. మహారాష్ట్ర తరపున అద‌‌న‌‌పు సొలిసిట‌‌ర్ జ‌‌న‌‌ర‌‌ల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. వాదనలు త్వర‌‌గా చేప‌‌ట్టాల‌‌ని బెంచ్​ను అభ్యర్థించారు. అయితే, దీనికి సుప్రీం బెంచ్​ నిరాకరించింది. తీర్పును వెనక్కి తీసుకునే సందర్భంలో తొందరపాటు కూడదని చెప్పింది. ఈ కేసులో బాధితులు నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడానికి ఎంతో శ్రమించారని గుర్తుచేసింది. నిర్దోషిగా ప్రక‌‌టించిన తీర్పును అత్యవ‌‌స‌‌రంగా మార్చాల్సిన అవ‌‌స‌‌రంలేద‌‌ని బెంచ్ వ్యాఖ్యానించింది.