ఆధారాల్లేకుండానే అరెస్ట్ చేయడం అలవాటైంది.. ఈడీ తీరుపై సుప్రీం సీరియస్

ఆధారాల్లేకుండానే  అరెస్ట్ చేయడం అలవాటైంది.. ఈడీ తీరుపై సుప్రీం సీరియస్

ఛత్తీస్ ఘడ్ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధారాల్లేకుండానే ఈడీ అరెస్ట్ చేస్తోందని అసహనం వ్యక్తం చేసింది. 

సరైన ఆధారాలు లేకుండానే ఈడీ కొందరిపై అభియోగాలు మోపుతోంది...  రూ. 40 కోట్లు సంపాదించారని ఆరోపణలు చేసిన ఈడీ ఆధారాలు చూపెట్టలేకపోతుంది.  లిక్కర్ స్కాం కేసులో డబ్బులు తీసుకున్నట్లు ఒక్క ఆధారాం కూడా లేదు..డబ్బులు స్వాధీనం చేసుకోకుండానే  వ్యక్తులను అరెస్ట్ చేస్తుంది.  గతంలో కూడా కొన్ని కేసుల్లో ఈడీ ఇలానే చేసింది.  అరెస్ట్ చేయడం ఈడీకి అలవాటుగా మారింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.

దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఈడీ తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి .కేంద్ర ప్రభుత్వం  ఈడీని అడ్డంపెట్టుకుని ప్రతిపక్షాలపై దాడులు చేయిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. బీజేపీలో చేరని నేతల ఇళ్లపై  ఈడీ దాడులు చేసి  ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేస్తోందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈడీ దాడులతో రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడం.. ప్రభుత్వాలను కూల్చడం కేంద్రానికి అలవాటుగా మారిందనే  విమర్శలు కూడా వెల్లువెత్తాయి.