కోటాలో ఏం జరుగుతోంది..? స్టూడెంట్ల ఆత్మహత్యలపై రాజస్థాన్ సర్కార్​ను నిలదీసిన సుప్రీం

కోటాలో ఏం జరుగుతోంది..? స్టూడెంట్ల ఆత్మహత్యలపై రాజస్థాన్ సర్కార్​ను నిలదీసిన సుప్రీం

న్యూఢిల్లీ: కోటాలో స్టూడెంట్ల వరుస ఆత్మహత్యలపై రాజస్థాన్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోటాలోనే స్టూడెంట్లు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నిలదీసింది. అసలు కోటాలో ఏం జరుగుతున్నదని ప్రశ్నించింది. ఈ ఏడాది ఇప్పటి దాకా 14 మంది స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నదని నిలదీసింది. 

కోటాలో నెలకొన్న పరిస్థితులపై జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‎తో కూడిన బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. మే 4న కోటాలో నీట్‎కు సిద్ధమవుతున్న ఓ విద్యార్థిని, ఐఐటీ ఖరగ్ పూర్ హాస్టల్‎లో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించి శుక్రవారం విచారణ చేపట్టింది.

స్టూడెంట్ల ఆత్మహత్యలు పట్టవా..?

స్టూడెంట్ల ఆత్మహత్యలు పట్టవా అని రాజస్థాన్ సర్కార్‎ను సుప్రీం బెంచ్​ప్రశ్నించింది. ‘‘ఐఐటీ ఖరగ్‌‌‌‌పూర్‌‌‌‌కు స్టూడెంట్.. మే 4న హాస్టల్‌‌‌‌ గదిలో ఉరివేసుకొని చనిపోతే  పోలీసులు మే 8న ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ నమోదు చేశారు. కేసు నమోదుకు 4 రోజులు ఆలస్యం ఎందుకు అయ్యింది..? స్టూడెంట్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా..? ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఒక్క కోటాలోనే 2018 నుంచి ఇప్పటి దాకా 106 మంది స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకున్నారు’’ అని బెంచ్​ పేర్కొంది.