
దేశరాజధాని ఢిల్లీ నగరంలో ప్రజలను బెంబేలెత్తిస్తున్న సమస్య వీధి కుక్కల దాడులు. దీనిపై మీడియాలో వస్తున్న విస్తృత కథనాలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం స్పందించింది. నగరంలోని పిల్లలు, వృద్ధులపై పెరుగుతున్న కుక్క కాటు కేసులపై సుమోటోగా విచారణను స్వీకరించిన సుప్రీం ధర్మాసనం.
ఢిల్లీ నగరంలో వీధికుక్కలు దాడులకు పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటూ వచ్చిన వార్తపై కోర్టు స్పందించింది. ఈ కథనంలో పిల్లలు, సీనియర్ సిటిజన్లు టీకాలు వేయని వీధికుక్కుల దాడితో రేబిస్ మరణాలకు కారణం అవుతోందని హైలైట్ చేసింది. దీనిపై రిట్ పిటిషన్ నమోదు చేయాలని సుప్రీం కోర్టు రిజిస్ట్రీని జస్టిస్ జెబీ పార్ధివాలా, జస్టిస్ ఆర్ మహదేవ్ లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
రాజధాని నగరంలో విచ్చలవిడిగా వీధి కుక్కలు చేస్తు్న్న దాడులు చిన్నారులను వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నట్లు వచ్చిన వార్తపై న్యాయస్థానం స్పందించింది. అందులో ఉన్న గణాంకాలు, వాస్తవాలను కోర్టు పరిగణలోకి తీసుకుంది. ప్రధానంగా నగర శివార్లలో రోజూ వందలాది కుక్క కాటు కేసులు నమోదు కావటం తద్వారా భయంకరమైన రేబిస్ వ్యాధికి పిల్లలు, వృద్ధులు బలైపోవటంపై స్పందించాల్సిన సమవయం వచ్చినట్లు ఉన్నత న్యాయస్థానం భావించింది. దీంతో రిజిస్ట్రీ ఈ కేసును సుమోటోగా రిట్ పిటిషన్‌గా నమోదు చేయాలని ఆ ఉత్తర్వులో పేర్కొంది.
ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రజలు వీధి కుక్కుల సంతతి నియంత్రణ, వాటికి టీకాలు వేయటంలో అధికారులు విఫలమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కోర్టు జోక్యం చేసుకోవటం కీలకంగా మారింది.