Supremecourt Jobs: కోర్టు మాస్టర్ పోస్టుల భర్తీ.. అర్హతల వివరాలు ఇవే..!

Supremecourt Jobs:  కోర్టు మాస్టర్ పోస్టుల భర్తీ.. అర్హతల వివరాలు ఇవే..!

సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కోర్ట్ మాస్టర్ (షార్ట్ హ్యాండ్) గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 15. 

పోస్టుల సంఖ్య: 30 కోర్టు మాస్టర్ (షార్ట్​హ్యాండ్) జనరల్ 16, ఎస్సీ 04, ఎస్టీ 02, ఓబీసీ 08. 
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. ప్రభుత్వ/ ప్రభుత్వరంగ, స్థానిక సంస్థల్లో కనీసం ఐదేండ్ల స్టెనోగ్రాఫర్ అనుభవం ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ పరిజ్ఞానం, నిమిషానికి 40 పదాల టైపింగ్ వేగం, ఇంగ్లిష్  షార్ట్​హ్యాండ్​లో నిమిషానికి 120 పదాల వేగం ఉండాలి. 
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 45 ఏండ్లు. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 30.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 15. 
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్​మెన్, పీడబ్ల్యూబీ అభ్యర్థులకు రూ.750. ఇతరులకు రూ.1500. 
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ హ్యాండ్, ఆబ్జెక్టివ్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు www.sci.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.