
భారత సుప్రీంకోర్టు సీనియర్ కోర్టు అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామర్, జూనియర్ కోర్టు అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్ 27.
పోస్టుల సంఖ్య: 26
పోస్టులు: సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామర్ 06, జూనియర్ కోర్టు అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ 20.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్ లేదా బీఈ, ఎల్ఎల్బీ, ఎంఎస్సీ, ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామర్ పోస్టుకు 18 నుంచి 35 ఏండ్ల మధ్యలో ఉండాలి. జూనియర్ కోర్టు అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ 18 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: జూన్ 27.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్,
దివ్యాంగులకు రూ.250. జనరల్, ఓబీసీ, అభ్యర్థులకు రూ.1000 చెల్లించాలి.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు sci.gov.in వెబ్సైట్లో చూడగలరు.
రాత పరీక్ష: జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్ నెస్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటీవ్ ఆప్టిట్యూడ్ నుంచి ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఇస్తారు. టెక్నికల్ నాలెడ్జ్‌పై ఆబ్జెక్టివ్ టైప్ టెక్నికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ప్రాక్టికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. షార్ట్ లిస్ట్ ఆధారంగా ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు.
►ALSO READ | నిరుద్యోగులకు గుడ్ న్యూస్: బ్యాంక్ ఆఫీసర్స్ పోస్టులు భర్తీ