సురభి కెమికల్ ఫ్యాక్టరీ ఎత్తివేయాలి.. సంగారెడ్డి జిల్లా- వడ్డేపల్లి గ్రామస్తుల ఆందోళన

సురభి కెమికల్ ఫ్యాక్టరీ ఎత్తివేయాలి..  సంగారెడ్డి జిల్లా- వడ్డేపల్లి గ్రామస్తుల ఆందోళన

హైదరాబాద్, వెలుగు:  ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్న సురభి కెమికల్ ఫ్యాక్టరీని ఎత్తివేయాలని సంగారెడ్డి జిల్లా హన్నురు  మండలం వడ్డేపల్లి గ్రామ ప్రజలు సనత్ నగర్ లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హెడ్​ఆఫీసు ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగారు. మాజీ సర్పంచ్ క్రిష్ణ, న్యాయవాది శ్రీనివాస్ తో కలిసి బాధితులు మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు.  ఫ్యాక్టరీ నిర్మాణంతో తాము తాగునీటికి ఇబ్బంది పడాల్సివస్తోందని  వాపోయారు.  వాటర్ ప్లాంట్ నిర్మిస్తున్నామని చెప్పిన యజమాని సంజీవరావు  కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని,  ఫ్యాక్టరీ వ్యర్ధాలను తాగునీటి చెరువులో కలుపుతున్నారని చెప్పారు.  ఎల్లమ్మగూడలో పర్మిషన్ తీసుకుని..   

తురకల ఖానాపూర్ లో అసైన్డ్​భూములను కబ్జా చేసి  ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని  ఆరోపించారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా  చర్యలు తీసుకోలేదన్నారు.  ప్రభుత్వం వెంటనే సురభి కెమికల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దుచేయాలని  కోరారు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం  గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తాం.  సురభి కెమికల్ ఫ్యాక్టరీ వారికి  వివరణ ఇచ్చేందుకు  టైమ్​ ఇస్తాం.  ఆ తర్వాత  క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి..  నిర్ణయం తీసుకుంటాం. 

- చీఫ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ రఘు