ఆసియా షూటింగ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో సురభి టీమ్‌‌‌‌కు సిల్వర్‌‌‌‌‌‌‌‌

ఆసియా షూటింగ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో సురభి టీమ్‌‌‌‌కు సిల్వర్‌‌‌‌‌‌‌‌

షింకెంట్‌‌‌‌: ఆసియా షూటింగ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఇండియా పతకాల వేటకొనసాగుతోంది. తెలంగాణ షూటర్ సురభి భరద్వాజ్ 25 మీటర్ల రైఫిల్ ప్రోన్ టీమ్ ఈవెంట్‌‌‌‌లో సిల్వర్‌‌‌‌‌‌‌‌ గెలిచింది.  శుక్రవారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఫైనల్లో సురభి, మణిని కౌశిక్, వినోద్ విదర్సతో కూడిన ఇండియా అమ్మాయిల టీమ్ మొత్తం 1846 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. 

సౌత్ కొరియాకు స్వర్ణం, కజకిస్తాన్‌‌‌‌కు కాంస్యం లభించాయి. ఇక,  నాన్‌‌‌‌ ఒలింపిక్ కేటగిరీ పోటీలైన 25 మీటర్ల సెంటర్ ఫైర్ ఈవెంట్‌‌‌‌లో యంగ్‌‌‌‌స్టర్ రాజ్‌‌‌‌కన్వార్‌‌‌‌‌‌‌‌ సింగ్ సంధు, డబుల్ ట్రాప్‌‌‌‌లో అంకుర్‌‌‌‌‌‌‌‌ మిట్టల్‌‌‌‌, అనుష్క భాటి గోల్డ్ మెడల్స్‌‌‌‌ నెగ్గారు. రాజ్‌‌‌‌కన్వార్ 583 పాయింట్లతో తన కెరీర్‌‌‌‌లో అతిపెద్ద విజయాన్ని అందుకున్నాడు. 

గుర్‌‌‌‌ప్రీత్ సింగ్, అంకుర్ గోయల్‌‌‌‌తో కలిసి 1733 పాయింట్లతో టీమ్ గోల్డ్‌‌‌‌  కూడా గెలుచుకున్నాడు.  మెన్స్‌‌‌‌ డబుల్ ట్రాప్‌‌‌‌లో అంకుర్ మిట్టల్107 స్కోరుతో స్వర్ణం సాధించాడు. విమెన్స్‌‌‌‌ డబుల్ ట్రాప్‌‌‌‌లో ఇండియా షూటర్లు అనుష్క భాటి (93), ప్రణిల్ ఇంగ్లే (89), హఫీజ్ కాంట్రాక్టర్ (87)  వరుసగా గోల్డ్‌‌‌‌, సిల్వర్‌‌‌‌‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌తో క్లీన్‌‌‌‌స్వీప్ చేశారు. ఈ ముగ్గురూ కలిసి టీమ్ ఈవెంట్‌‌‌‌లో కూడా స్వర్ణం సాధించారు.