రైనా కూడా మహీ బాటలోనే..వీడ్కోలు

రైనా కూడా మహీ బాటలోనే..వీడ్కోలు

దశాబ్దకాలం వైట్ బాల్ క్రికెట్ లో టీమిండియాకు కీలక సేవలందించిన సూపర్ బ్యాట్స్ మన్ సురేశ్ రైనా కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నా డు. తన కెప్టెన్, మెంటార్ అయిన ధోనీ రిటైర్మెం ట్ ప్రకటించిన నిమిషం తర్వాత రైనా తన వీడ్కోలు అంశాన్ని ఇన్ స్టాలో వెల్లడించాడు. ‘నీతో కలిసి ఆడటం కంటే నాకు ఏదీ గొప్ప కాదు. నీతో కలిసి ఆడినందుకు నా హృదయం గర్వంతో ఉప్పొంగిపోతున్నది. ఈ జర్నీలో నీతో పాటే నడవాలని అనుకుంటున్నా . థ్యాంక్యూ ఇండియా, జై హింద్ ’ అని రైనా రాసుకొచ్చాడు. తన క్రికెట్ కెరీర్ మొత్తాన్ని ధోనీ కనుసన్నల్లో కొనసాగించిన రైనా..  వీడ్కోలు కూడా అతనితోనే కలిసి ముగించడం విశేషం.

2010 ఇండియా తరఫున శ్రీలంకపై తొలి టెస్ట్ ఆడిన రైనా.. మొత్తం 18 మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించాడు. 26.48 యావరేజ్ తో 768 రన్లు చేశాడు. ఒక సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు సాధించాడు. 2015 ఆసీస్ పై చివరి టెస్ట్ ఆడాడు. వన్డే క్రికెట్ లో అత్యంత కీలక ప్లేయర్ గా ఎదిగిన రైనా.. 226 మ్యా చ్ లు ఆడాడు. 35.31 సగటుతో 5615 రన్స్ చేశాడు. 5 సెంచరీలు, 36 హాఫ్ సెం చరీలు ఉన్నాయి. శ్రీలంక (2005)పై తొలి వన్డే ఆడిన ఈ యూపీ బ్యాట్స్ మన్ ఇంగ్లండ్ (2018) తో ఆఖరి మ్యాచ్ ఆడాడు. ఇక 78 టీ20లు ఆడిన రైనా 1605 రన్లు చేశాడు. ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆఫ్ బ్రేక్ బౌలర్ గానూ రైనా తన సేవలందించాడు. టెస్ట్ ల్లో 13, వన్డేల్లో 36, టీ20ల్లో 13 వికెట్లు తీశాడు.

వరల్డ్​కప్ విజయంలో..

‘కొన్ని విలువైన ఇన్నింగ్స్​తో రైనా మాకు వరల్డ్​కప్ సాధించిపెట్టాడు’ టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్​స్టెన్ వ్యాఖ్యలివి. ఇవి చాలు 2011లో ఇండియా విశ్వ విజేతగా నిలవడంలో రైనా రోల్ ఏంటో చెప్పేందుకు. ఆ వరల్డ్​కప్ ప్రారంభ మ్యాచ్ ల్లో రైనా బెంచ్ కే పరిమితం అయ్యాడు. కెప్టెన్ ధోనీ.. యూసుఫ్ పఠాన్ కు మొగ్గు చూపడంతో గ్రూప్ స్టేజ్ లో ఆడలేదు. సెహ్వాగ్ గాయపడడంతో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో తొలి చాన్స్​వచ్చింది. అనంతరం క్వార్టర్ ఫైనల్ కు యూసుఫ్ ప్లేస్ లో తుది జట్టుకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్స్​ పోరులో 34 రన్స్​ చేసిన ఈ లెఫ్ట్​ హ్యాం డర్​.. పాక్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో 36 పరుగులు చేశాడు. ఫీల్డర్​గా వెలకట్టలేని భాగస్వామ్యం అందించాడు. ఇక, 2015 వన్డే వరల్డ్​కప్ లోనూ రైనా సత్తా చాటాడు. మిడిలార్డర్​లో ఆడే సురేశ్​ జింబా బ్వేతో జరిగిన మ్యాచ్ లో 74 రన్స్​ చేశాడు. ఇక, పాక్ తో జరిగిన పోరులో సెంచరీ కొట్టి మ్యాచ్ విన్నింగ్ పెర్పామెన్స్​ చేశాడు.

               మ్యాచ్ లు  పరుగులు    టాప్ స్కోర్   సెంచరీలు   హాఫ్ సెంచరీలు   వికెట్లు

టెస్ట్​లు      18             768              120                 01                      07                    13

వన్డేలు            226      5615             116*              05                       36                  36

టీ20లు             78      1605             101                 01                       05                13