టీజీవో అసోసియేషన్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్ మెంట్ 2024 డైరీని ఆవిష్కరించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి. 2024, జనవరి 24వ తేదీన.. హైదరాబాద్ సెక్రటేరియట్ లో మంత్రిని కలిసిన సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసోసియేషన్ ఉద్యోగులు.. మంత్రికి డైరీ అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ ఉద్యోగుల సంక్షేమం విషయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆయా శాఖల్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించటం జరుగుతుందని హామీ ఇచ్చారు. రెవెన్యూ శాఖలో పారదర్శకత తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నామని.. ఉద్యోగుల సూచనలు, సలహాలు తప్పకుండా స్వీకరిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి.
2024 డైరీ ఆవిష్కరణలో అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.నరహరిరావు, సెక్రటరీ ఎం.రాంచందర్, ట్రెజరర్ వి.శ్రీరాం, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.
