IND vs NZ: నా బ్యాటింగ్ ఆర్డర్ మారడానికి కారణం అదే.. తొలి టీ20కి ముందు సూర్య కామెంట్స్ వైరల్

IND vs NZ: నా బ్యాటింగ్ ఆర్డర్ మారడానికి కారణం అదే.. తొలి టీ20కి ముందు సూర్య కామెంట్స్ వైరల్

స్వదేశంలో జరగబోయే వరల్డ్ కప్ ముందు న్యూజిలాండ్ తో టీమిండియా టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా బుధవారం (జనవరి 21) నాగ్‌పూర్ వేదికగా విదర్భ క్రికెట్ అసోసియేషన్ లో ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మరి కొన్ని గంటల్లో తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. మెగా టోర్నీకి ముందు ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిహార్సల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా భావిస్తున్న ఇండియా.. పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది. దాంతో టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న చిన్నచిన్న లోటుపాట్లను ఇక్కడే సరి చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో  సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలవడంతో పాటు రెండోసారి టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిలబెట్టుకున్న ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది.   

ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఆందోళనకరంగా మారింది. గత ఏడాది సూర్య ఒక్క అంతర్జాతీయ టీ20 హాఫ్ సెంచరీ కూడా చేయకుండా జట్టుకు భారంగా మారాడు. అయితే జట్టు విజయాలు సాధించడంతో సూర్య ఫామ్ ను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. సూర్య ఫామ్ పోవడానికి బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పు కారణమని కొందరు భావిస్తున్నారు. ఇదే ప్రశ్న సూర్యకు తొలి టీ20 మ్యాచ్ కు ముందు ఎదురైంది. ప్రెస్ కాన్ఫరెన్స్ లో భాగంగా సూర్య బ్యాటింగ్ స్థానంపై రిపోర్టర్ సూటిగా ప్రశ్నించాడు.

 తన బ్యాటింగ్ స్థానంపై సూర్య మాట్లాడుతూ ఇలా అన్నాడు.. "నేను ఇండియా తరపున రెండు స్థానాల్లో బ్యాటింగ్ చేశాను. నాలుగో స్థానంలో నా బ్యాటింగ్ రికార్డ్స్ బాగున్నాయి. మూడో స్థానంలో కూడా నేను మంచిగా ఆడాను. పరిస్థితికి తగ్గట్టుగా నా బ్యాటింగ్ పొజిషన్ మారుతుంది. ఉదాహరణకు సంజు సామ్సన్ ఔట్ అయితే నేను బరిలోకి దిగుతాను. ఒకవేళ అభిషేక్ శర్మ ఔట్ అయితే మూడో స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడు. ప్రస్తుతానికి తిలక్ బాగానే ఉన్నాడు వరల్డ్ కప్ సమయానికి జట్టులోకి వస్తాడని ఆశిస్తున్నాం.  

కొంతకాలంగా నేను పరుగులు తక్కువగా చేస్తున్నాను. గత మూడు లేదా నాలుగు సంవత్సరాలుగా నేను చేస్తున్న పనిని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. నా ఇన్నింగ్స్ చాలా సార్లు జట్టు విజయానికి కారణమైంది. ఇప్పటికీ నేను నెట్స్ లో విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నాను. వ్యక్తిగత మైలురాళ్ళు కోసం ఎప్పటికీ ఆడను. నా ఇన్నింగ్స్ జట్టుకు ఉపయోగపడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది". అని సూర్య తన ఫామ్ గురించి అదేవిధంగా తన బ్యాటింగ్ ఆర్డర్ గురించి చెప్పుకొచ్చాడు.