
ఆసియా కప్ కు ముందు భారత గుడ్ న్యూస్. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్ 2025కు ఆడే అవకాశాలు అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ నెలలో సర్జరీ చేయించుకున్న సూర్య.. ఆసియా కప్ కు పూర్తి ఫిట్ నెస్ సాధించడం ఖాయమని రిపోర్ట్స్ చెబుతున్నాయి. సూర్య స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ నుండి కోలుకున్న తర్వాత తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించాడు. గత వారం చివర్లో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో టీమిండియా టీ20 కెప్టెన్ బ్యాటింగ్ సెషన్‌ను నిర్వహించాడు. ఆసియా కప్ లోపు సూర్య ఎక్కువ రిస్క్ తీసుకోకుండా పూర్తి కోలుకునేలా బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
టీ20 ఫార్మాట్ లో జరగనున్న ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు జరగనుంది. సూర్య కుమార్ ఈ ఏడాది వరుస సర్జరీలతో ఇబ్బందిపడుతున్నాడు. జూన్ 26, 2025 జర్మనీలోని మ్యూనిచ్‌లో సూర్య స్పోర్ట్స్ హెర్నియా ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ‘కుడి వైపు పొత్తి కడుపులో ఉన్న హెర్నియాకు డాక్టర్లు విజయవంతంగా సర్జరీ చేశారు. మూడేళ్లలో సూర్యకుమార్‌కు ఇది మూడో సర్జరీ. 2023లో చీలమండకు ఆపరేషన్ చేయించుకున్న అతను 2024లోనూ స్పోర్ట్స్ హెర్నియాకు చికిత్స తీసుకున్నాడు.
ఈ మెగా టోర్నీకి ఒకవేళ సూర్య అందుబాటులో లేకపోతే హార్దిక్ పాండ్య భారత జట్టు కెప్టెన్సీ చేసే అవకాశం ఉంది. సూర్య దూరమైతే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీనియర్ ప్లేయర్ పాండ్యనే. దీంతో యువ జట్టుకు కెప్టెన్సీ హార్దిక్ నడిపించవచ్చు. మొత్తం ఎనిమిది జట్లు పోటీలో ఉండగా.. గ్రూప్–ఎలో ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్–బిలో శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ బరిలో నిలిచాయి. దుబాయ్, అబుదాబి వేదికలుగా ఓవరాల్‌గా 19 మ్యాచ్‌లు జరుగుతాయి.
2023లో జరిగిన గత ఎడిషన్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టైటిల్ నెగ్గిన ఇండియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఇండియా మ్యాచ్ ల విషయానికి వస్తే సెప్టెంబర్ 10న యుఎఇతో తొలి మ్యాచ్ ఆడుతుంది. సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. రెండు మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి. సెప్టెంబర్ 19న అబుదాబిలో ఒమన్‌తో గ్రూప్ దశలో భారత్ చివరి మ్యాచ్ ఆడనుంది.
India T20I captain Suryakumar Yadav bats for first time after surgery, on track to feature in Asia Cup
— ANI Digital (@ani_digital) August 4, 2025
Read @ANI Story |https://t.co/XVfvkZmF96#SuryakumarYadav #AsiaCup #cricket #TeamIndia pic.twitter.com/FcrD6wAfCS