Suryakumar Yadav: భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేరు ఇప్పుడు నెట్టింట్లో నడుస్తోంది. శుక్రవారం ముంబైలోని అధికారిక నివాసం వర్షలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను సూర్య మర్యాదపూర్వకంగా కలిశాడు. అయితే ఇండియా తర్వాతి టీ20 సిరీస్ ఈ నెల చివర్లోనే ఉండటం, ఇంకోవైపు సూర్యను కెప్టెన్సీ నుంచి పీకేస్తారనే టాక్ నడుస్తున్న టైమ్‌లోనే సీఎంతో భేటీ జరగడం క్రికెట్ ఫ్యాన్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
మహారాష్ట్ర సీఎంతో సూర్య భేటీ:
ఈ మీటింగ్‌కు సంబంధించిన ఫొటోను ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ఎక్స్ (ట్విట్టర్) లో షేర్ చేసింది. ప్రస్తుతానికైతే సూర్యకుమార్ యాదవే టీ20 కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ రాబోయే రోజుల్లో ఆయన కెప్టెన్‌గా కొనసాగుతాడా లేదా అనే ప్రశ్నలకు ఇవాళ (శనివారం) బీసీసీఐ ప్రకటించబోతుంది. 2028 టీ20 వరల్డ్ కప్, అట్లనే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎంట్రీ ఇస్తుండటంతో.. లాంగ్ టర్మ్ ప్లాన్ కోసం కెప్టెన్‌ను మార్చే ఆలోచనలో బోర్డు ఉన్నట్టు ఇన్సైడ్ టాక్.
వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్:
మార్చిలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోనే భారత్ వరుసగా రెండోసారి ట్రోఫీ గెలిచి హిస్టరీ క్రియేట్ చేసింది. 2024లో రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీమ్ బాధ్యతలు అందుకున్న సూర్య.. ఇండియా డామినేషన్‌ను కొనసాగించాడు. కానీ, కెప్టెన్సీ సూపర్‌గా ఉన్నా.. ఆయన బ్యాటింగ్ ఫామ్ మస్తు ఘోరంగా పడిపోవడమే ఇప్పుడు పెద్ద రందిగా మారింది.
ఐపీఎల్ లో ఘోరంగా విఫలం:
ఐపీఎల్ 2026 లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన సూర్యకుమార్ యాదవ్.. 13 మ్యాచ్‌ల్లో కేవలం 20.76 యావరేజ్‌తో 270 రన్స్ మాత్రమే చేసిండు. ఆఖరికి మొన్న జరిగిన ముంబై టీ20 లీగ్‌లో ట్రైయంఫ్ నైట్స్ ముంబై నార్త్ ఈస్ట్ జట్టు తరఫున ఆడినా ఒక్కటంటే ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. ఈ రేంజ్‌లో ఫామ్ కోల్పోవడంతో.. 36 ఏళ్ల సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పిస్తారనే ప్రచారం గట్టిగానే సాగుతోంది.
రేసులో హార్దిక్, శ్రేయస్:
సూర్యకుమార్ యాదవ్ ను గనుక కెప్టెన్సీ నుంచి పక్కనబెడితే.. ఆ ప్లేస్ కోసం హార్దిక్ పాండ్యాతో పాటు శ్రేయస్ అయ్యర్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీళ్లతో పాటు సంజూ శాంసన్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ కూడా లైన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వరుసగా రెండు వరల్డ్ కప్‌లు గెలిపించిన కెప్టెన్‌ను.. కేవలం ఒక్క ఐపీఎల్ సీజన్ ఫామ్ చూసి ఎలా తీసేస్తారంటూ సోషల్ మీడియాలో సూర్య ఫ్యాన్స్ సెలక్టర్ల పైన ఫుల్ ఫైర్ అవుతున్నారు.
मुख्यमंत्री देवेंद्र फडणवीस यांची आज भारतीय क्रिकेटपटू सूर्यकुमार यादव यांनी मुंबई येथील वर्षा निवासस्थानी सदिच्छा भेट घेतली. @Dev_Fadnavis @surya_14kumar#Maharashtra #DevendraFadnavis pic.twitter.com/CtB91Kc7iF
— CMO Maharashtra (@CMOMaharashtra) June 5, 2026
