V6 News

సూర్యాపేట పట్టణంలో 75 సీసీ కెమెరాలు..కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం

సూర్యాపేట పట్టణంలో 75 సీసీ కెమెరాలు..కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం

సూర్యాపేట, వెలుగు:  నేరాల నివారణ, నియంత్రణలో  సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు,  వ్యాపారులు ముందుకు రావాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ కోరారు.   పట్టణ పోలీస్ స్టేషన్‌‌లో  75 సీసీ కెమెరాలను అనుసంధానం చేసి ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌‌ను  ఎస్పీ నరసింహ  సోమవారం ప్రారంభించారు.  ఎస్పీ నరసింహ మాట్లాడుతూ..  సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రజల భద్రతకు పోలీసులుఏ కట్టుబడి ఉన్నారని తెలిపారు.  

భద్రతా చర్యల్లో భాగంగా 75 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిని నిరంతరం పర్యవేక్షించేందుకు పట్టణ పోలీస్ స్టేషన్‌‌కు అనుసంధానం చేసి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌‌ను ఏర్పాటు చేశామన్నారు.   ఈ కార్యక్రమంలో ఆర్టీవో జయప్రకాశ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, సూర్యాపేట పట్టణ ఇన్‌‌స్పెక్టర్ వెంకటయ్య, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.