సుశాంత్‌‌‌‌ను హత్య చేశారనడానికి ఆధారాల్లేవ్

సుశాంత్‌‌‌‌ను హత్య చేశారనడానికి ఆధారాల్లేవ్

న్యూఢిల్లీ: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్‌‌ను హత్య చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఎయిమ్స్ ఆస్పత్రి తెలిపింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్‌‌మెంట్ స్పష్టం చేసింది. ‘సుశాంత్ ఉరి వేసుకోవడం వల్లే చనిపోయాడు. అతడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవు’ అని ఎయిమ్స్ మెడికల్ బోర్డు చైర్‌‌పర్సన్ డాక్టర్ సుధీర్ గుప్తా చెప్పారు. సుశాంత్ డెడ్ బాడీకి అటాప్సీ చేసిన ముంబైలోని కూపర్ హాస్పిటల్‌‌‌కు చెందిన ఫోరెన్సిక్ డాక్టర్లను ఇంటర్వ్యూ చేయడంతోపాటు ఫొటోలను పరిశీలించిన అనంతరం హీరోది మర్డర్ కాదని ఎయిమ్స్ బోర్డు నిర్ధారించింది.