కృష్ణా జిల్లాలో అనుమానిత కరోనా వైరస్ కేసు నమోదు

కృష్ణా జిల్లాలో అనుమానిత కరోనా వైరస్ కేసు నమోదు

కృష్ణా జిల్లాలో  అనుమానిత కరోనా వైరస్  కేసు నమోదైంది. మనిషి వెంట్రుక మందంలో 900వ వంతుండే అతి చిన్న కరోనా వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దేశాదేశాలకు అతి వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 82 దేశాలకు అంటింది. ఈ వైరస్ తో తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. విదేశాల నుంచి రాష్ట్రాలకు తిరిగిన వచ్చిన వారికి కరోనా వైరస్ టెస్ట్ లు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ  జగ్గయ్యపేటలో కరోనా వైరస్ అనుమానితురాలిని వైద్యులు గుర్తించారు. జగ్గయ్యపేటకు చెందిన పెద్దిరెడ్డి బాలశ్రీ అనే యువతిని ఇటలీలో చదువుకుంటుంది. అయితే ఇటీవల కరోనాతో భయాందోళనకు గురైన బాలశ్రీ జగ్గయ్య పేటకు వచ్చింది. నాటి నుంచి యువతి దగ్గడం, జలుబుతో బాధపడుతుండడంపై అనుమానం వ్యక్తం చేసిన వైద్యులు..కరోనా టెస్ట్ ల నిమిత్తం విజయవాడకు తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రాథమిక చికిత్స ను అందిస్తున్న వైద్యులు బ్లడ్ శాంపిల్స్ ను వైరాలజీ ల్యాబ్ కు పంపిస్తున్నట్లు చెప్పారు.