146 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత

146 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత

బడ్జెట్ సమావేశాల సందర్బంగా ప్రతిపక్ష ఎంపీల  సస్పెన్షన్ ను రద్దు చేసినట్లు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గత సమావేశాల సందర్భంగా సస్పెన్షన్ కు గురైన ప్రతిపక్ష సభ్యులందరి సస్పెన్షన్ ఉపసంహరించుకోవాలని లోక్, సభ, రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీలతో చర్చలు జరిపాం.. దీనికి  లోక్ సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ లు  అంగీకరించారని  ప్రహ్లాద్ జోషి తెలిపారు. సస్పెండైన అందరు ఎంపీలు జనవరి 30 నుంచి జరిగే బడ్జెట్ సెషన్స్ కు హాజరవుతారని చెప్పారు.  

గత సెషన్ లో పార్లమెంట్ లో కలర్ స్మోక్ ప్రయోగించడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పార్లమెంటులో  భద్రతా వైఫల్యంపై ప్రతిపక్ష ఎంపీలు చర్చకు పట్టుబట్టారు. దీంతో 146 మంది ఎంపీలను   సస్పెండ్ చేశారు. ఇది దేశ చరిత్రలోనే మొదటి సారి కావడం గమనార్హం.  132 మంది  ఎంపీల సస్పెన్షన్ ఆ సెషన్ తోనే ముగుస్తుంది. ముగ్గురు లోక్ సభ సస్పెన్షన్ ను ప్రివిలేజ్ కమిటీ జనవరి 12న ఎత్తేసింది. మిగతా 11 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్  పెండింగ్ లో ఉండగా..  ఎత్తేస్తున్నట్లు ఇవాళ కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.  దీంతో మొత్తం 146 మంది ఎంపీల సస్పెన్షన్ ను ఎత్తేసినట్లైంది. 

జనవరి 30 నుంచి ఫిబ్రవరి 9 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.  ఫిబ్రవరి 1న ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.