నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ నిలిపివేత

నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ నిలిపివేత

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్‌ను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ఆధార్ అడగొద్దని హైకోర్టు ఆదేశించడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. ఇప్పటికే స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రం రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తదుపరి స్లాట్ బుకింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు రెండు రోజుల్లో తెలియచేస్తామన్నారు. మరోవైపు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఆదేశాలతో…. అనుసరించాల్సిన వ్యూహాలపై సర్కార్ దృష్టిపెట్టింది. రిజిస్ట్రేషన్లపై ఇవాళ సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. క్యాంప్ ఆఫీస్‌లో జరిగే ఈ రివ్యూకు… సీఎస్‌తో పాటు రెవెన్యూ అధికారులు హాజరు కానున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి హైకోర్టు చేసిన కామెంట్లపై పూర్తిస్థాయిలో అధికారులతో చర్చించనున్నారు. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లడమా లేదంటే తీర్పుకు అనుగుణంగా విధివిధానాలు మార్చి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టడమా అనే అంశంపై రెవెన్యూ, న్యాయశాఖ నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

For More News..

పెళ్లింట్లో భారీ చోరీ.. 210 తులాల నగలు మాయం

సంగమేశ్వరం పూర్తయితే శ్రీశైలం ప్రాజెక్టు ఎండిపోతది

కస్టమ్స్‌‌ ఆఫీసర్ల కస్టడీ నుంచి రూ.1.10 కోట్ల విలువైన బంగారం గాయబ్