
ఆంధ్ర ప్రదేశ్: తన ఎదుగుదలకు కారణం మీడియతో ఉన్న అనుబంధమేనని అన్నారు సినీ నటుడు, SVBC చైర్మన్ పృధ్వి. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన ఆయన… తిరుమలలో రాజకీయాలు మాట్లాడనని కర్పూరం మీద ఒట్టుపెట్టానని.. కొండ దిగితే మాత్రం వైఎస్ జగన్ సైనికున్నని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో వైసీపీ కి ఒక పాట పాడానని, జగన్ సీఎం గా ప్రమాణస్వీకారం సందర్భంగా మరో పాట పాడానని పృధ్వి తెలిపారు.
తాను కళాకారులను కలిసినంత మాత్రాన జగన్ కు ప్రయోజనమేమీ లేదని పృధ్వి తెలిపారు.SVBC ఉద్యోగులను రెగ్యులర్ చేయడమే తన ఎజండా అని అందుకోసం.. జగన్ కాళ్లు పట్టుకోవడానికైనా రెడీ అని చెప్పారు. గత చైర్మన్ లు చేయలేని పనులను తాను చేస్తానని తెలిపారు.