తొమ్మిదేళ్ల వయసులోనే స్కూలుమానేసి గ్లోబల్ వార్మింగ్ (భూతాపం) పై అలుపెరుగని పోరాటం చేస్తోంది స్వీడన్ అమ్మాయి గ్రెటా థన్బర్గ్. ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే అవకాశందక్కింది. నోబెల్ ప్రైజ్ కు నామినేట్ అయింది. ఇలా మంచి కారణం కోసం పోరాడుతున్న అమ్మాయికి, తన కుటుంబానికి విమర్శలు ఎక్కువవుతున్నాయి. బెదిరింపులొస్తున్నాయి.
సోషల్ మీడియాలో, బయట ఎన్నోతిట్లు వినిపిస్తున్నాయి. ముందు స్కూలుకెళ్లి చదువుకోవాలంటూ ఉచితసలహాలు వస్తున్నాయి. ఎన్ని ఇబ్బందులెదురైనా గ్రేటా మాత్రం నిర్ణయం మార్చుకోలేదని తల్లి, సింగర్ ఎర్న్మన్ చెప్పారు. గ్రెటాకోసం కుటుంబమంతా ‘వీగన్’లమయ్యామని, సోలార్ బ్యాటరీలు ఇంట్లో పెట్టుకున్నామన్నారు. ‘కూరగాయలను మేమేపండించుకుంటున్నాం’ అని చెప్పారు.
ఎక్కడికెళ్లాలన్నా సైకిల్నే వాడుతున్నామని, ఎమర్జెన్సీ సమయంలో ఎలక్ట్రిక్ కారును వాడుతున్నామని వివరించారు. పారిస్ అగ్రిమెంట్కు తగ్గట్టు చట్టాలు చేయాలని, భూతాపాన్ని తగ్గించాలని మాత్రమే నేతలను గ్రెటా కోరుతోందన్నారు.
