రామాయంపేట, వెలుగు: రోడ్డు ప్రమాద బాధితులకు స్వీపర్, సెక్యూరిటీ గార్డ్ వైద్యం చేయడంపై రామయంపేట మండలంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వివరాలిలా ఉన్నాయి.. నార్సింగి మండలం జప్తి శివనూర్ శివారులో జాతీయ రహదారిపై ఆటో అదుపుతప్పి బోల్తా పడగా అందులోని దుర్గం రాములు, సునంద, సంతోష్, సువర్ణ, మహేశ్‌లతో పాటు మరికొందరికి గాయాలయ్యాయి.
దీంతో వారిని ట్రీట్‌మెంట్ కోసం 108 సిబ్బంది రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నలుగురు డాక్టర్లు అందుబాటులో ఉండాల్సి ఉండగా ఒక్కరు మాత్రమే అందుబాటులో ఉన్నారు. దీంతో సెక్యూరిటీ గార్డ్, స్వీపర్, స్టాఫ్ నర్సులుగాయపడ్డ వారికి వైద్యం చేశారు. తరచూ ఈ ఘటనలు జరుగుతున్నాయని అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
