చలి రుచులు : స్వీట్ పొటాటో రబ్దీ..స్టఫ్డ్గోబీ... వైరైటీ రెసిపీలు.. ఒక్కసారి తింటే అస్సలు వదలరు.. మళ్లీ మళ్లీ కావాలంటారు..!

చలి రుచులు : స్వీట్ పొటాటో రబ్దీ..స్టఫ్డ్గోబీ... వైరైటీ రెసిపీలు.. ఒక్కసారి తింటే అస్సలు వదలరు.. మళ్లీ మళ్లీ కావాలంటారు..!

 చలికాలంలో ఎక్కువగా దుంప కూరలు, ఆకుకూరలతో కూరగాయల మార్కెట్స్ కళకళలాడుతుంటాయి. వాటితో రెగ్యులర్ గా చేసుకునే వంటలు కాకుండా కాస్త వెరైటీగా తయారయ్యే వంటకాలను ట్రై చేయండి. చల్లటి వాతావరణంలో నోటికి వెచ్చని, చక్కని రుచిని అందించండి

స్వీట్​ పొటాటో రబ్దీ తయారీకి కావాలసినవి

  • పాలు– 150 మిల్లీ లీటర్లు
  • స్వీట్ పొటాటో - రెండు టేబుల్ స్పూన్లు (ఉడికించి, మెత్తగా చేసి)
  • పంచదార - అర టీస్పూన్
  • గోరువెచ్చని నీళ్లు - అర కప్పు 
  • యాలకుల పొడి - అర టీస్పూన్ 
  • కుంకుమపువ్వు తీగలు -కొన్ని
  • మిక్స్ డ్ నట్స్ -ఒక టీస్పూన్

తయారీవిధానం 

  •   పాలు వేడిచేసి మెత్తగా చేసిన స్వీట్ పొటాటో వేయాలి. పాలు చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి.
  •  తరువాత కుంకుమపువ్వు తీగల్ని ఒక కప్పు గోరువెచ్చని నీళ్లలో వేసి అవి కరిగిపోయే వరకు ఉంచాలి.
  • ఈ నీళ్లను పాల మిశ్రమంలో వేసి బాగా కలపాలి. యాలకుల పొడి వేసి నాలుగు నిమిషాలు ఉడికించాలి.
  • చివర్లో నట్స్ పైన చల్లాలి.  తయారైన రడ్డీని ఒక గిన్నెలోకి తీసి చూల్లార్చా లి. తరువాత ఫ్రిజ్​ లో  ఒకగంట ఉంచాలి. చల్ల చల్లగా తింటే తియ్య తియ్యగా బాగుంటుంది

స్టఫ్డ్​గోబీ తయారీకి కావలసినవి

  • గోబి ( క్యాలీఫ్లవవర్​)–నాలుగు
  • నూనె – వేగించడానికి సరిపడ

ఫిల్లింగ్​ కు 

  • చీజ్​ తురుము – అరకప్పు
  • ఎండుద్రాక్షలు– 15
  • తాజాదానిమ్మ గింజలు– మూడు టేబుల్​ స్పూన్లు
  • జీడిపప్పు పలుకులు– మూడు టేబుల్​ స్పూన్లు
  • కొత్తిమీర తరుగు - గుప్పెడు
  • కోవా- నాలుగు టేబుల్ స్పూన్లు

పిండి కోసం

  • శెనగపిండి- 350 గ్రాములు
  • వాము– ఒక టేబుల్​ స్పూన్​
  • వెల్లుల్లి రెబ్బలు - రెండు టేబుల్ స్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • మంచి నీళ్లు -పిండి తయారీకి సరిపడినన్ని

తయారీ విధానం

  • పాన్​ లో నీళ్లు వేడి చేయాలి.   ఇందులో. ఉప్పు, పసుపు, క్యాలీఫ్లవర్ పువ్వులు వేయాలి. క్యాలీఫ్లవర్ కాస్త మెత్తగా కాగానే తీసేయాలి.
  • పిండిని ఒక గిన్నెలో ఫిల్లింగ్ కోసం ఉన్న పదార్ధాలన్నింటినీ వేసి చేతులతో మెత్తగా కలపాలి.
  • క్యాలీఫ్లవర్​ ను  ఈ మిశ్రమంలో వేసి పువ్వంతటా పిండి పట్టేట్టు చేయాలి.
  • దీన్ని నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి..
  •  వీటిని వేడివేడిగా తింటుంటే భలే  బాగుంటుంది.