అందానికి స్వీట్ ట్రీట్ మెంట్

అందానికి స్వీట్ ట్రీట్ మెంట్

చాక్లెట్లు తినడాన్ని చాలామంది ఇష్టపడతారు.  మీకో విషయం తెలుసా! చాక్లెట్లు   హెల్త్​ను కాపాడతాయి. ముఖ్యంగా ఒత్తిడి  తగ్గించడంలో ముందుంటాయి. అయితే ఇవి ఆరోగ్యానికే కాదు.. అందం పెంచేందుకు  కూడా అంటున్నారు  బ్యూటీషియన్లు. చాక్లెట్ ఫేస్​ ప్యాక్​ వల్ల  ఉపయోగం ఏంటో, అది ఎలా  చేయాలో తెలియాలంటే ఈ టిప్స్ చదవండి.
పెద్దపెద్ద స్పాలలో, సెలూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో చాక్లెట్​ ఫేషియల్స్​ ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. కానీ, వాటిని ఇంటిదగ్గర ఈజీగా తయారు చేయొచ్చు. ఎవరైనా సరే, ఈ ఫేషియల్స్​ను ఉపయోగించుకోవచ్చు. 
డార్క్ చాక్లెట్​లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు ఏ, బీ1, సీ, డీ, ఈ, ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఈ విటమిన్లు చర్మాన్ని కాపాడతాయి. ఎండ దెబ్బ తినకుండా, ముడతలు పడకుండా కాపాడతాయి. చాక్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు స్కిన్​ని యంగ్​గా కనిపించేలా చేస్తాయి.  చాక్లెట్​ ఫేస్​ మాస్క్ వల్ల ‘అరోమాథెరపీ’ ఫలితాలు అందుతాయి. 
చాక్లెట్ మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇలా...
మూడు టీస్పూన్ల కోకో పౌడర్ ,  రెండు  టీస్పూన్ల ఓట్స్, గుడ్డు  తెల్లసొన , ఒక టీ స్పూన్ తేనె , పెరుగు వేసి బాగా కలపాలి.  ఈ పేస్ట్​ను ఫేస్​కు రాయాలి.  ఒకవేళ పేస్ట్​ పలుచగా అయితే కోకో పౌడర్​ కలపాలి.  గట్టిగా అయితే పాలు, లేదా పెరుగు కలపాలి.  మొదట చర్మాన్ని క్లీన్​ చేయాలి. పెదవులు, కళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని వదిలేసి ఫేస్​ ప్యాక్​  రాయాలి.  20 నుండి 30 నిమిషాల తర్వాత నీళ్లతో శుభ్రం చేయాలి. 
జిడ్డు చర్మం పోవాలంటే.. కోకో పౌడర్ లేదా చాక్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ముల్తానీ మట్టి, గుడ్డు  తెల్లసొన, రోజ్ వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలపాలి. ముఖానికి పట్టించి ఆరాక  కడిగేయాలి. ఇందులో  పండ్ల గుజ్జు  కూడా కలపొచ్చు. 
ఫేస్​ ప్యాక్​  తీశాక  రోజ్ వాటర్ లో ముంచిన  కాటన్​ను సున్నితంగా ముఖం మీద రుద్దాలి.