స్విగ్గీ పేమెంట్ వాలెట్ లాంఛ్

స్విగ్గీ పేమెంట్ వాలెట్ లాంఛ్

ఐసీఐసీఐతో భాగస్వామ్యం

ఇన్‌‌స్టెంట్‌ గా ఆన్‌‌లైన్ పేమెంట్లు

బెంగళూరు : ఫుడ్ డెలివరీ ప్లాట్‌ ఫామ్ స్వి గ్గీ తన పేమెంట్ ప్లాట్‌ ఫామ్‌ ను లాంఛ్ చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ పార్టనర్‌‌‌‌షిప్‌తో ఈ సొంత వాలెట్‌ ను లాంఛ్ చేసినట్టు స్వి గ్గీ వెల్లడించింది. స్వి గ్గీ వాలెట్‌ను మనీ స్టోర్ చేసుకునేందుకు, రీఫండ్స్ పొందేందుకు, ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఇన్ స్టెంట్ గా ఆన్ లైన్ పేమెంట్లు జరిపేందుకు వాడుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు ఈ వాలెట్‌ను వెంటనే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇతరులు మాత్రం ప్రభుత్వ ఐడీ కార్డును బ్యాంక్‌‌కు సమర్పించి వాడుకోవడం ప్రారంభించుకోవచ్చు. కన్జూమర్లకు పలు పేమెంట్ ఆప్షన్లను ఇది ఆఫర్ చేస్తోందని స్వి గ్గీ ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ అగర్వాల్ చెప్పారు . ఈ వాలెట్ పేమెంట్ ప్రొసీజర్లను మెరుగుపరుస్తోందని, పేమెంట్ ఫెయిల్యూర్స్ ను తగ్గిస్తుందని తెలిపారు.