సలావుద్దీన్​ కొడుకుతో పాటు నలుగురి ఉద్యోగాలు తీసివేత

సలావుద్దీన్​ కొడుకుతో పాటు నలుగురి ఉద్యోగాలు తీసివేత
  • యాంటీ ఇండియన్స్​తో సంబంధాలే కారణం! 

శ్రీనగర్​: హిజ్బుల్​ ముజాహిదీన్​ చీఫ్​ సయ్యద్​ సలావుద్దీన్​ మూడో కొడుకు సయ్యద్​ అబ్దుల్​ ముయీద్​ను ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించారు. ఆయనతో పాటు మరో ముగ్గురినీ ఉద్యోగాల్లోంచి తీసివేసినట్లు కాశ్మీర్​ అధికారులు ప్రకటించారు. దేశానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచారం చేస్తూ.. టెర్రరిస్ట్​ గ్రూపులతో లింకులు ఉన్నాయనే కారణంగా  తొలగిస్తున్నట్టు శనివారం తెలిపారు. ముయీద్.. కామర్స్​ అండ్​ ఇండస్ట్రీస్​ డిపార్ట్​మెంట్​లో ఇన్ఫర్మేషన్​ అండ్​ టెక్నాలజీ మేనేజర్​గా విధులు నిర్వహిస్తున్నాడు. సలావుద్దీన్​ ఇద్దరు కొడుకులు సయ్యద్​ అహ్మద్, అహ్మద్​ షకీల్​లను కూడా ప్రభుత్వం నిరుడే డిస్మిస్​ చేసింది. కాశ్మీర్​ ఎంటర్​ప్రెన్యూర్​షిప్​ డెవలప్​మెంట్​ ఇన్​స్టిట్యూట్​ కాంప్లెక్స్​లో జరిగిన 3 దాడుల్లో  ముయీద్​ హస్తం ఉన్నట్టు ఆరోపణలున్నాయి.

ఫారూఖ్​ అహ్మద్​ దార్​అలియాస్​ బిట్టా కరాటే భార్య అసభ్​ ఉల్​ అర్జమంద్​ ఖాన్​ను కూడా ఉద్యోగం నుంచి తొలగించారు. ఈమె కాశ్మీర్​ అడ్మినిస్ట్రేటివ్​ సర్వీస్​ ఆఫీసర్​. ఈమె యాంటీ ఇండియన్​ యాక్టివిస్టుల​ కోసం ఫండ్​ జమ చేశారని అధికారులు చెప్తున్నారు. కాశ్మీర్​ వర్సిటీలో సైంటిస్ట్​గా పని చేస్తున్న మునీత్ అహ్మద్​భట్​, అసిస్టెంట్​ ప్రొఫెసర్​గా ఉన్న మాజిద్​ హుస్సేన్​ ఖాద్రీని కూడా జాబ్​ నుంచి తొలగించారు. టెర్రరిస్ట్ గ్రూపులతో వాళ్లకు సంబంధాలున్నాయని అధికారులు వెల్లడించారు.